రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Also Read : Kuberaa : కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పిన అమెజాన్..
తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమన్ అందించిన సాంగ్స్ ప్రభాస్ కు నచ్చలేదని అందుకే స్వయంగా డార్లింగ్ దిగాడని కెమెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వాస్తవానికి రాజాసాబ్ సినిమాకు తమన్ ఎప్పుడో సాంగ్స్ కంపోజ్ చేసి ఇచ్చేసాడు. అందులో కొన్ని సాంగ్స్ ను షూట్ కూడా చేసారు. ఆ తర్వాత స్క్రిప్ట్ లో వచ్చిన కొన్ని మార్పుల కారణంగా ముందు కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిటిని పక్కన పెట్టేసారు. ఇప్పుడు మరలా తమన్ తో సాంగ్స్ ను కంపోజ్ చేపిస్తున్నారు. తమన్ అందుకోసం వర్క్ స్టార్ట్ చేసాడు. ఈ నేపథ్యంలోనే తమన్ స్టూడియోకు ప్రభాస్ వెళ్లి సరదాగా కాసేపు ఉండి వచ్చాడు. అంతే తప్ప వర్క్ నచ్చక కాదు. తమన్ సాంగ్స్ ఫినిష్ చేసాక సాంగ్స్ షూట్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమన్ వర్క్ పట్ల మారుతీ చాలా అండ్ టీమ్ హ్యాపీ గా ఉన్నారు. జెట్ స్పీడ్ లో జరుగుతున్న రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు.