వారాహి యాత్రకు వచ్చినపుడు ఇక్కడ మంత్రి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నన్ను బాధించింది.. రైతు కంట కన్నీరు పెట్టించిన మంత్రి ఆయన కొడుకు తుడిచిపెట్టుకుపోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. విభజన జరిగిననాటి నుంచి మనకి అన్యాయం జరుగుతుంది.. ప్రభుత్వం ఎలా ఉందో చూడండి.. పోలవరం పూర్తి అయిందా అంటే ఇరిగేషన్ మంత్రి డ్యాన్స్ చేస్తున్నారు.. ఓటు చేలిపోకూడదు అని పోటీ చేసే సీట్లు తగ్గించాము అని ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి సీటు మా అన్నాయకు ప్రకటించి తర్వాత బీజేపీకి కేటాయించాము.. ఇదంతా ప్రజల భవిష్యత్తు కోసం.. మీ భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నాం.. క్లాస్ వార్ అంటున్న జగన్. పేదలను మరింత దోచుకుంటున్నారు అని జనసేనాని తెలిపారు.
Read Also: MP Ranjith Reddy : మతం వ్యక్తిగతం.. జనహితమే సమ్మతం.!
పోలీసుల కష్టాన్ని దోచుకుంటున్నారు అని జనసేన చీఫ్ పవన్ అన్నారు. మంత్రి ఇక్కడ దోచేసిన డబ్బుతో తెలంగాణ బాలానగర్ లో ఫ్యాక్టరీలు పెట్టారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర పెద్దలను ఒప్పించాను.. ఎక్కడ నెగ్గాలి అనేది కాదు ఎక్కడ తగ్గాలో అదే చేశాం.. నేను పిసరంత తగ్గితే పూర్తిగా తగ్గినట్టు కాదు.. నా స్వార్ధాన్ని, ఆశలు పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రజల భవిష్యత్త్ బాగుండాలి అని పొత్తుకి కృషి చేశాను అని ఆయన చెప్పుకొచ్చారు. సివిల్ సప్లై మంత్రి పేరు కూడా తలవడం ఇష్టం లేదు.. రైతు కష్టాల్లో ఉంటే మంత్రి ఎంత అహకారం చూపించారు.. ఇలాంటి వారిని గోస్తని నదిలో కలిపేయాలి.. ఇక్కడి నుంచి గల్ఫ్ కి వలసలు వెళ్లిపోతున్నారు.. ప్రతి ఒక్కరూ పేదలు, పారిశ్రామిక వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారు.. మధ్య తరగతి వ్యక్తులను ఎవ్వరూ పట్టించుకోవడంలేదు.. అసెంబ్లీ లో అడుగు పెట్టగానే నేను అడిగేది సీపీఎస్ గురించి.. ఒక ఏడాదిలో దాన్ని సాధించాలి.. అందుకు చంద్రబాబు సహకరించాలి.. కష్టం అయినా చేయాలి.. జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు.. మధ్య తరగతి ప్రజలు బలంగా బయట నిలబడితే అది జనసేన అవుతుంది.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.