Pragathi: నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ప్రగతి.. జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించడం మొదలుఎపెట్టింది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉండేది. దీంతో ఈ వయస్సులో.. ఎందుకు ఇవన్నీ అని ఎంతోమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. అయితే అవన్నీ .. ఆమె సరదా కోసం చేయలేదని.. నేషనల్ లెవెల్లో తన సత్తా చాటడానికి తెలుస్తోంది. అవును.. తాజాగా ప్రగతి బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొంది. కేవలం పాల్గొనడమే కాకుండా కాంస్య పతకం కూడా అందుకొని ఔరా అనిపించింది.
Mahesh Babu: పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం ఎలా… మగాళ్ళకి మహేష్ అదిరిపోయే టిప్
48 ఏళ్ళ వయస్సులో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించడం అంటే మాటలు కాదు.. ప్రగతి.. దాన్ని చేసి చూపించి శభాష్ అనిపించుకుంది. ఒకప్పుడు.. ఈ వయస్సులో ఈ బరువులు ఎత్తడాలు ఏంటి అన్నవారే.. ఇప్పుడు శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ వీడియోను ప్రగతి షేర్ చేస్తూ.. ” నా కథ మొత్తం బ్యాడ్ నిర్ణయాలతో నిండిపోయింది. హార్ట్ బ్రేక్స్, ఏమి చేయలేని పరిస్థితులు.. కానీ, ఇది నాకు పునర్జన్మ. బూడిద నుంచి మళ్లీ పైకి లేవడం నేర్చుకుంటున్నాను. ఎప్పుడు వదులుకోవద్దు అనేది నా జీవిత మంత్రం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై అభిమానులు.. సూపర్ ప్రగతి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.