రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. రైతు స్వరాజ్య వేదిక క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి కౌలు రైతుల స్థితిగతులపై రూపొందించిన నివేదికను పవన్ కు ప్రతినిధులు అందచేశారు. రైతుల కష్టాలపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిద్దామని పవన్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయన్నారు. ముఖ్యంగా కౌలు రైతులు సుమారు 3 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు సాయం చేయడంలో కూడా కులం కోణం చూడటం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కౌలు రైతుల కడగండ్లకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. రాష్ట్రంలో పండే వరి పంటలో 80 శాతం కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదేనని, పంట వేసి నష్టాల పాలై, అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
Also Read : CM Jagan : ఏప్రిల్ 3న ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ.. పార్టీ వర్గాల్లో చర్చ
వరితోపాటు మిర్చి, పత్తి లాంటి పంటలు వేసినవారూ నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా యాత్రల సందర్భంలో కౌలు రైతుల కుటుంబాల ఆవేదన నేరుగా తెలుసుకొంటున్నానన్నారు. అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ చేసిన రైతు భరోసా యాత్రల్లో 8 జిల్లాల్లో 700కి పైగా కౌలు రైతు కుటుంబాలకి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశామని తెలిపారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన భరోసా కలిగించగలుగుతున్నామన్నారు. జనసేన పార్టీ తొలి నుంచి రైతు పక్షం వహిస్తోందని, వరి పంట కొనుగోలు చేసి కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతు సౌభాగ్య దీక్ష చేశామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా నివర్ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతుల కోసం నిలబడ్డామని ఆయన తెలిపారు.
Also Read : Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల.. హద్దుదాటి.. షర్ట్ బటన్స్ విప్పి.. దేవుడా