ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే చివరి రోజు అవుతుందని మండిపడ్డారు. బట్టలు విప్పి నడి రోడ్డు పై నిలపెడతానని ఫైర్ అయ్యారు.
Freedom Fighter Marriage: 49 ఏళ్ల మహిళతో 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడి వివాహం
ఇదిలా ఉంటే.. కన్నా లక్ష్మీ నారాయణ పై ఆంబోతు రాంబాబు దాడి చేయించాడని మండిపడ్డారు. వీళ్ళకి ఎలా కళ్లెం వేయాలో తనకు తెలుసన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తానని చంద్రబాబు చెప్పారు. టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ధరలు తగ్గిస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు. అంతేకాకుండా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొన్నారు. మళ్ళీ హామీ ఇస్తున్నా.. పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తానని అన్నారు.
Nitish Kumar-BJP: కమలం వ్యూహం హిట్టైనట్టేనా?
డ్వాక్రా సంఘాలు బయటకు రావాలి.. పోరాటాలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ విశ్వసనీయత బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. 99.5 శాతం హామీలు నెరవేర్చారు అని జగన్ చెప్తున్నాడు.. అబద్ధాలు చెప్పడంలో జగన్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని దుయ్యబట్టారు. జగన్ సిద్ధం అంటున్నాడు.. జగన్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.