టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం…
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధికి చిరునామాగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాలుగు శాతం రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని ఆరోపించారు. మొత్తం 30 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది.. గతంలో తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం తక్కువకు పడిపోయిందని తెలిపారు. రావణాసురడి వధ జరిగితేనే రాష్ట్రానికి మేలు…
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నీ పని, నీ పార్టీ పని ఫినిష్ అని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే నీకు నిద్ర పట్టదు.. నీ అవినీతి డబ్బు, అధికార దుర్వినియోగం ఆపుతుందా అని దుయ్యబట్టారు. ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సభ కోసమని.. సభా ప్రాంగణానికి…
ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల…
కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న పత్తికొండలో రా..కదిలి రా కార్యక్రమం జరుగనుందని, ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని తిక్కారెడ్డి కోరారు.
గుడివాడలో రా..! కదలి రా..! కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..?.. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని.. నన్నే విమర్శిస్తారా..? నేనేంటో చూపిస్తానంటూ ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా.. సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి "రా కదలి రా!" పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు..