Ram Pothineni : ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్ “..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ కు అద్భుతమైన మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సారి డబుల్ ఇస్మార్ట్ కు బ్లాక్ బస్టర్ ట్యూన్స్ అందిస్తున్నాడు.ఈ సినిమాను పూరీజగన్నాధ్ ,ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Also :Kalki 2898 AD : కల్కి ట్రైలర్ అదిరింది..దీపికా పాత్ర డబ్బింగ్ పై ట్రోల్స్..
రీసెంట్ గా ఈ చిత్రం నుండి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.ఇదిలా ఉంటే హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు సమాచారం.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన తరువాత మూవీ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఈ సినిమాను రామ్ తన సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.