కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు పాకేజ్ ని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతుండు అని ఆయన మండిపడ్డారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదని, యువరాజు కేటీఆర్, ఎలెన్ మాస్క్ x ప్లాట్ ఫామ్ మీద ఉండి మాట్లాడుతుండని, ఆయన ఎక్స్ లో మెసేజ్ లు పెట్టి నవ్వుల పాలు అవుతుండని ఆయన మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ బుల్డోజ పాలన మీద సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిందని, తెలంగాణ హైడ్రా పై కోర్టు తీర్పు ఇచ్చినట్లు కేటీఆర్ వక్రీకరిస్తున్నాడని, హైడ్రా పై ప్రజలను తికమక పెట్టడానికి కేటీఆర్ అలా చేస్తుండన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Bhopal: ధూమ్ 2 సినిమా తరహాలో చోరీకి ప్లాన్.. బెడిసికొట్టి చివరికిలా..!
హైడ్రా ను బుల్డోజర్ తో పోల్చి తికమక పెట్టొద్దని, బీఆర్ఎస్ లో రెండు గ్రూప్ లు ఉన్నవన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఖమ్మంలో రెండు బీఆర్ఎస్ గ్రూప్ లు కొట్టుకుంటే,కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసు పెట్టిండ్రని, కేటీఆర్ ఇప్పుడు ఏ దేశంలో ఉండో ఎవరికి తెలియదని ఆయన విమర్శలు గుప్పించారు. కేటీఆర్ దయా దాక్షిణ్యాలతో గెలిచిన 8మంది బీజేపీ ఎంపీ లు ఎక్కడ పోయారని, ఓపెన్ టాప్ జీప్ ఎక్కి మాట్లాడటం కాదు ప్రజల కష్టాలను తీర్చాలన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా.. ఎంత ఒత్తిడి వచ్చినా రేవంత్ రెడ్డి హైడ్రా ను ముందుకు తీసుకపోతడని, హైదరాబాద్ లో లేక్స్ ను కాపాడుతం అని రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లో పెట్టిండన్నారు. మాకు ప్రజా పాలన అందియ్యాలన్న పట్టుదల ఉందని, ప్రజల కోసం మంచి చేసే హైడ్రా పై మీ డ్రామా ఏంటని ఆయన ప్రశ్నించారు.
Vijayawada Floods: వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..