విజయనగరంలో గురజాడ పురస్కారాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అందించడంపై వివాదం తలెత్తింది. దీంతో చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారాన్ని ప్రకటించడంపై కవులు, రచయితలు, కళాకారులు విజయనగరంలోని గురజాడ నివాసం నుండి నిరసన ర్యాలీకి దిగారు. ప్రతి సంవత్సరం గురజాడ పురస్కారాన్ని అందిస్తుంటారు. ఈ ఏడాది గురజాడ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకు అందించడంపై కవులు, కళాకారులు,రచయితలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురజాడ భావ జాలానికి భిన్నమైన చాగంటి కోటేశ్వరరావుకు ఈ అవార్డును అందించడంపై మండిపడుతున్నారు కవులు, రచయితలు, కళాకారులు. చాగంటి కోటేశ్వరరావుకు తాము వ్యతిరేకం కాదని కవులు, రచయితలు, కళాకారులు వెల్లడించారు.
Also Read : TDP Protest : సత్యసాయి జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. పోలీస్ స్టేషన్ ముందు పరిటాల సునీత
చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతారని, గురజాడ భావ జాలం దానికి భిన్నంగా ఉన్న విషయాన్ని నిరసనకారులు గుర్తు చేస్తున్నారు. భిన్నమైన భావజాలం ఉన్న చాగంటి కోటేశ్వరరావుకి ఈ అవార్డు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు నిరసనకారులు . గతంలో కూడా పలువురు సినీ రంగంలోని వారికి గురజాడ పురస్కారాలు అందించిన సమయంలో కూడా తాము వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు నిరసన కారులు. అయితే.. ఇదే డిమాండ్ తో కవులు, కళాకారులు, రచయితలు గురజాడ ఇంటి నుండి ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉంటే.. దీనిపై తాజాగా చాగంటి కోటేశ్వర్ రావు స్పందిస్తూ.. గురజాడ అంటే ఆయన గౌరవమని, అందుకే ఈ అవార్డుకు అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వివాదం తలెత్తుతుందని తాను ఊహించలేదన్నారు.
Also Read : Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్తో డేటింగ్