తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియకి ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆన్లైన్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణని నిలిపివేయాలని ఆదేశించింది. కాగా.. ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా.. ఎన్నికల సంఘం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిలిపివేసింది.
Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
కాగా.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత నెల 26న గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వారు కూడా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అటు పౌరసరఫరాల శాఖ సైతం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.. కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు మీ సేవా ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిరంరత ప్రక్రియ అని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవా కేంద్రాల్లో కొత్త ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల స్వీకరణను వెంటనే ప్రారంభిచాలని మరోవైపు ప్రభుత్వం కూడా ఆదేశించింది. తాజాగా ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆదేశాలతోనే రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాలేదనే విషయంపై స్పష్టత వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఈసీ బ్రేక్ వేసినట్లు తెలిసిపోయింది.