Jio: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. పాపులర్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు అయిన రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీని తాజాగా మార్చింది. ఇకపై ఈ ప్లాన్లకు బేస్ ప్లాన్ వాలిడిటీకి సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ వ్యాలిడిటీని నిర్ణయించింది. ఇంతకుముందు, ఈ రూ.69 ప్లాన్ బేస్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత కాలం పనిచేసేది. అంటే, ఉదాహరణకి మీ మెయిన్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటే ఈ డేటా ప్లాన్ కూడా 84 రోజులు పనిచేస్తుండేది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్ కేవలం 7 రోజుల వ్యాలిడిటీకే పరిమితం కానున్నాయి.
Also Read: Union Budget 2025 LIVE UPDATES: కేంద్ర బడ్జెట్ 2025-26 లైవ్ అప్ డేట్స్..
ఇదివరకు రూ.69 ప్లాన్‌లో 6GB డేటా వస్తుంది. ఈ డేటాను మీ మెయిన్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు ఉపయోగించడానికి వీలుండేది. కానీ, ఇప్పుడు ఈ ప్లాన్ లో ఎలాంటి డాటాను మార్పు చేయకుండా కేవలం 7 రోజుల వ్యాలిడిటీ మాత్రమే కల్పించింది. ఈ మార్పు యూజర్లకు చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. ఎందుకంటే కొంత డేటా అవసరం ఉన్నప్పుడు కూడా తరచుగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్లాన్ వాడాలంటే జియో సిమ్‌లో ఏదో ఒక బేస్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే రిలయన్స్ జియో రూ.139 ప్లాన్‌లో 12GB డేటా అందిస్తుంది. ఇదివరకు మెయిన్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు ఉపయోగించడానికి వీలుండేది. ప్రస్తుతం ఈ ప్లాన్ లో కూడా 7 రోజుల వ్యాలిడిటీనే కల్పించింది. మొత్తానికి రెండు ప్లాన్స్ లో ఇంతకుముందు బేస్ ప్లాన్ వాలిడిటీ అనుసరించి పనిచేసిన, ఇప్పుడు మాత్రం కేవలం 7 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ మార్పు వల్ల, ఈ రెండు డేటా ప్లాన్ల వాడకం కస్టమర్లకు మరింత ఖర్చుతో కూడుకున్నది. యూజర్లు పలు సార్లు రీఛార్జ్ చేయడం వల్ల ఇది వారికి అదనపు ఆర్థిక భారం అవుతుంది.ఈ మార్పులు కస్టమర్లకు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి. అలాగే, జియో నుంచి మరిన్ని మార్పులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.