Viral Video: బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయిపై ప్రేమ పెంచుకున్న ఇద్దరు స్కూల్ విద్యార్థినులు తన బాయ్ ఫ్రెండ్ కోసం బహిరంగంగా గొడవకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో రెండు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఒకరికి తెలియడంతో ఇద్దరూ ముందుగా వాగ్వాదానికి దిగారు.
గొడవ జరగక ముందు ఇద్దరూ తమ సహచరులను తీసుకుని రోడ్డుపై వచ్చారు. తొలుత మాటల యుద్ధంగా మొదలైన ఈ గొడవ, కొంతసేపటికి హింసాత్మకంగా మారింది. స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్న విద్యార్థినులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకోవడం, జుట్టును పట్టుకొని లాగడం మొదలుపెట్టారు. ఈ గొడవ బహిరంగంగా రోడ్డుపై బహిరంగంగా జరగడంతో అక్కడి వారి ఆశ్చర్యపోయారు. చాలామంది విద్యార్థినులు ఈ ఘర్షణలో పాల్గొన్నారు. ఇది చూసిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థినులను శాంతింపజేశారు. దీంతో గొడవ అదుపులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై మరింత చర్చ మొదలైంది.
ఈ ఘటన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదర్ పోలీస్‌స్టేషన్ అధికారి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. స్కూల్ విద్యార్థినుల మధ్య జరిగిన ఈ ఘర్షణపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే, ఈ గేట్ కు సంబంధించి కేసు నమోదు చేయకపోయినా, సంబంధిత వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని హెచ్చరించారని తెలిపారు. మొత్తానికి ఈ ఘటన యువత నడవాల్సిన దారిని ప్రతిబింబించేలా ఉంది. పాఠశాలలో చదువుకునే వయసులో ఉన్న విద్యార్థినులు ఇలా మార్పు చేయడం ఆందోళన కలిగించే అంశం. ఇది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా విద్యా సంస్థలు, సమాజం కూడా చర్చించాల్సిన సమస్య.
बॉयफ्रेंड के लिए छात्राओं की मारपीट का वीडियो हुआ वायरल !!
पूर्णिया में बॉयफ्रेंड के लिए बीच सड़क आपस में भिड़ गईं दो लड़कियां, दोनों ने एक दूसरे बर जमकर परसाए लात-घूंसे !!#ViralVideo #Trendingvideo #ShockingNews pic.twitter.com/HPmuRlNDVr
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 3, 2025