Bomb Threat to Gannavaram Airport: విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది.. అప్రమత్తమైన ఎయిర్ పార్ట్ సిబ్బంది.. తనిఖీలు చేపట్టారు.. విమానాల రాకపోకలు సైతం నిలిపివేసినట్టు తెలుస్తోంది.. అయితే, అది ఆకతాయిల పనిగా తెలుస్తోంది.. ఎందుకంటే ఆకతాయి మళ్లీ ఫోన్ చేసి అలాంటిది ఏమీ లేదని చెప్పినట్టు సమాచారం.. ఏమైనా తనిఖీలు చేశారు అధికారులు. ఇక, ఢిల్లీ వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది.. ఆకతాయి తణుకు ప్రాంతం నుంచి ఫోన్ చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలసులు..
గన్నవరం ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు ఫేక్ కాల్ పై కేసు నమోదు చేశారు.. ఎయిరిండియా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు.. నిన్న రాత్రి ఎయిర్ పోర్టులో బాంబు ఉందనే ఆకతాయి ఫోన్ తో అలజడి నెలకొందని తెలిపారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఢిల్లీకి విమానాన్ని పంపించారు ఎయిర్ పోర్ట్ అధికారులు.. తణుకు ప్రాంతం నుంచి ఆకతాయి కాల్ వచ్చినట్టు ప్రాథమిక నిర్దారణ వచ్చిన గన్నవరం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా బాంబు బెదిరింపు ఫోన్ కాలం.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం రేపింది.
అయితే, గన్నవరం ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు ఫేక్ కాల్ చేసిన ముప్పాళ్ల రంగ రామన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు తణుకు పోలీసులు.. ఎయిర్ పోర్టులో బాంబు ఉందని నిన్న రాత్రి ఫేక్ కాల్ చేశాడు రంగ రామన్.. గతంలో కూడా పలువురు వీఐపీలకు కాల్ చేసి రంగరామన్ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.. అతని మానసిక స్థితి చూసి మందలించి వదిలేసినట్టుగా తెలుస్తుండగా.. ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్ చేయడంతో రంగరామన్ను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.