అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్ఫటికి వినిపిస్తుంటాయి.
కాగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యూజికల్ కాంబినేషన్ ను ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మంగళవారం బుకింగ్స్ ఓపెన్ చేయాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 35mmలో కేవలం 2 నిమిషాలలోనే హౌస్ ఫుల్ అయింది. ఇంత తక్కువ టైమ్ లో మొత్తం టికెట్స్ సోల్డ్ అవుట్ అయిన సినిమాగా ఆర్య 2 రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత రీరిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇంకెన్ని ఫుల్ రన్ లో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.