ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ మత విశ్వాసాల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో శివం ద్వివేది ఫిర్యాదు చేశాడు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు తాజాగా కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. సోమవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను సాక్షిగా విచారించనుండగా, మరికాసేట్లో ఆయన సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఇక ఇదే కేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిల్ల సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్‌కు తమ వాంగ్మూలాలు ఇచ్చారు.…
Raghunandan Rao: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. యుద్ధం చేసే ధైర్యం, దమ్ము ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అలాగే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. యుద్ధం అనేది మాటలతో మాట్లాడేది కాదు.. అది చేసేటోనికి తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది నెత్తి కాదు, కత్తి కాదు.. అంటూ ఆయన…
BJP MP: పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. ఉగ్రవాద దాడి సమయంలో మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులుగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందని ఆయన అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.
BJP MP: యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. భారత సైనిక వివరాలతో పాటు పలు సున్నిత వివరాలను పాకిస్తాన్ అధికారులతో పంచుకుంది. దీనికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఓ అధికారితో అత్యంత సన్నిహిత సంబంధాలను ఉన్నట్లు తేలింది. ఈ అధికారిని భారత్ బహిష్కరించింది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మత యుద్ధాలను ప్రేరేపిస్తోందని.. దీనికి న్యాయస్థానమే బాధ్యత వహించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి…
Raghunandan Rao : ఇవాళ బీజేపీ కార్యాలయంలోపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గూండాలు రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలన్నారు రఘునందన్ రావు. నిన్న ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి…
DK Aruna : సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను బీజేపీ ఎంపీ డీకే. అరుణ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, ఒకరి మరణం, మరొకరి తీవ్ర గాయపడడం బాధకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి…
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై అధ్యయనానికి ఏర్పాటైన జాయింట పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.