రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని మాదాపూర్, హై టెక్ సిటీ, కొండాపూర్‌లాగా కేఎల్ఆర్ అభివృద్ధి చేస్తారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్. బుధవారం కాంగ్రెస్ నేత కిచ్చాన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేఎల్ఆర్ అంటే నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు భూములను ఆక్రమంచుకోడం తప్పా వేరే పనులేవీ చెయ్యడం లేదని సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం లక్ష్మారెడ్డి పనిచేస్తారని, కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో నీ తుచా తప్పకుండా అమలు చేయడంలో ముందు ఉంటారన్నారు.
Also Read: India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..
పార్టీ కోసం సొంత డబ్బులతో ఖర్చులు పెట్టీ పనిచేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు బీఆర్ఎస్‌లోకి వెళ్ళారని పేర్కొన్నారు. ఆమె పార్టీ వీడితే కాంగ్రెస్‌కి నష్టం జరుగుతుందని భావించారు…కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెక్కుచెదరకుండా ఉన్నారన్నారు. అయితే అటువంటి సబితా ఇంద్రారెడ్డి కి ఈసారి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన లేదు.. రెషన్ కార్డులు ఇవ్వలేదు… దళిత బందు ఇవ్వలేదు.. ఆరోపించారు. ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెసే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి పంపిస్తమన్నారు.
Also Read: KLR: గడీల పాలన వద్దు… అందరి పాలన కావాలి: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
రాష్ట్రం వస్తే మన సంపద మనది అవుతుందని అనుకున్నాం.. కానీ, సంపద రాకపోగా అప్పులు వచ్చాయన్నారు. సంపద మొత్తం BRS నేతలు పందికొక్కుల్లగా తిన్నారు కాబట్టి ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదంతా కక్కిస్తామని, సంపద నీ పంచడం కోసమే కాంగ్రెస్ 6 గ్యారెంటీ లు తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సంపదని ప్రజలకు పంచుతామని తెలిపారు. ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో KLR నీ గెలిపించాలని ఆయన కోరారు. తమకున్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టబోతుందని ఆయన అన్నారు. అనంతరం దొరల ప్రభుత్వం పోవాలి… ప్రజల ప్రభుత్వం రావాలి అంటూ భట్టి నినాదించారు.