నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ప్రాంతాన్ని ఏమీ పట్టించుకోలేదన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయంతో వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రితో ప్రచారం చేయిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఇసుక మాఫియా..లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, రివర్స్ టెండరింగ్ మాఫియా, వైసీపీ ప్రభుత్వమే ఓ మాఫియా. మద్యం షాపుల్లో నగదు లావాదేవీలు ఉంటే గోల్ మాల్ చేయొచ్చని ఆన్ లైన్ పేమెంట్లు అందుబాటులో ఉంచలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ లేదు,ప్రజలకు రక్షణ లేదన్నారు సీఎం రమేష్. బీజేపీ అభ్యర్థి తరఫున బీజేపీ సీనియర్ నేతలు ఆత్మకూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Jaggareddy: ఎక్కడ రామ మందిరం ఉందో అక్కడే చిచ్చు మొదలైంది