నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.…
ఆత్మకూరు అసెంబ్లీకి ఈ నెల 23న ఉపఎన్నిక జరగనుంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఆత్మకూరు వంతు వచ్చింది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లో మేకపాటి గౌతంరెడ్డి వరసగా గెలిచారు. కాకపోతే 2014లో 31 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. 2019లో 22 వేల ఓట్లకే అది పరిమితమైంది. గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ…
ఉపఎన్నిక జరుగుతున్న ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో క్రమంగా పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 13 వేల మంది. 2014లో ఇక్కడ వైసీపీకి 33 వేలు, 2019లో 22 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ ఎలా ఉన్నా.. ఉపఎన్నికలో మాత్రం లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు నాయకులు.…
మేకపాటి గౌతమ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు.. నేను లేకుంటే గౌతమ్ అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ నెల్లూరు వెళ్లిన ఆయన.. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గౌతమ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి.. గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడుతూ.. గౌతమ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. గౌతమ్ మన మధ్య లేడనే…
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించింది ప్రభుత్వం… ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో… గౌత్‌రెడ్డి శాఖలను ఇతర మంత్రులుకు కేటాయించిన విషయం తెలిసిందే.. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్,…
ఏపీ అసెంబ్లీలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. తన సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్…
మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఉదయం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉదయగిరి వరకు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. ఈ అంతిమ యాత్రలో నేతలు, మంత్రులతో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాకు బయలుదేరుతున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయగిరి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకుంటారు. అక్కడ దివంగత మేకపాటి గౌతం రెడ్డి బౌతికకాయానికి నివాళులు ఆర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటారు. Read:…
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన భౌతికకాయాన్ని నిన్న హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో అంత్యక్రియలు జరగనున్నాయి. నెల్లూరు నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయింది. జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం, డిసీ పల్లి, మర్రిపాడు, బ్రాహ్నణపల్లి మీదుగా ఉదయగిరికి అంతిమయాత్ర చేరుకోనుంది. ఉదయగిరిలో జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్…