Jaggareddy: ఎక్కడ రామ మందిరం ఉందో అక్కడే చిచ్చు మొదలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వం సం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వయోపరిమితి సడలింపుతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేఖంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించింది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. బీజేపీ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మోదీ వల్లనే దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎక్కడ రామ మందిరం ఉందో అక్కడే చిచ్చు మొదలైందన్నారు. ఆర్మీలో దేశ సేవ చెద్ధాం అనుకునే యువతకు ఉద్యోగాలు రాకుండా చేసే ప్రయత్నం జరగుతోందని ఆరోపించారు.
Also Read
సికింద్రాబాద్ అల్లర్లలో మరణించిన రాకేష్ మరణానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రాకేష్ ను బీజేపీ పోలీసులు కాల్చారా..లేక టీఆర్ఎస్ పోలీసులు కాల్చారా..? అని అడిగారు. బీజేపీ కంట్రోల్ లో ఉన్న పోలీసులే కాల్చారని జగ్గారెడ్డి అన్నారు. డెడ్ బాడీపై టీఆర్ఎస్ కండువా కప్పేసి రాజకీయం చేస్తుందని విమర్శించారు. బీజేపీ చంపుతుంది, టీఆర్ఎస్ శవయాత్ర చేసి రాజకీయం చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఇలాంటి రాజకీయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన అన్నారు. పోలీసుల కాల్పులకు బలికావద్దని.. అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ మిమ్మల్ని కాపాడుకుంటుందని జగ్గారెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు సోనియా గాంధీ అండగా ఉంటారని అన్నారు. స్వాతంత్రదేశంలో ఎప్పుడూ కూడా సికింద్రాబాద్ లో ఇంత పెద్ద ఘటన చోటు చేసుకోలేదని అన్నారు.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!