ఆత్మకూరు ఉపఎన్నికలో లక్ష మెజారిటీ కోసం లక్ష పాట్లు పడ్డారు వైసీపీ నేతలు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేశారు. బై ఎలక్షన్‌లో గెలిచినా లక్ష్యాన్ని చేరుకోకపోవడమే అధికారపార్టీ శిబిరంలో చర్చగా మారింది. ఆ అంశంపైనే పోస్టుమార్టం చేస్తున్నారట. పార్టీ నేతల అనైక్యత వల్లే లక్ష మెజారిటీ రాలేదా? ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ బరిలో లేకపోవడం.. బీజేపీ మాత్రమే బరిలో ఉండటంతో.. సులభంగా లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఆశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా…
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో వైసీపీ నాయకుడి దాష్టీకం బయటపడింది. ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేసి ఏజెంట్‌గా నిలబడ్డారన్న అక్కసుతో బీజేపీ మహిళా నేతపై వైసీపీ నాయకుడు హజరత్తయ్య దాడికి పాల్పడ్డాడు. గొల్లపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళను ఇంటికి పిలిపించి కొట్టి, చిత్రహింసలకు గురిచేసి రూమ్‌లో నిర్బంధించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని మహిళను బెదిరించాడు. అయితే బాధిత మహిళ భయపడకుండా వైసీపీ నేత హజరత్తయ్యపై…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,332 ఓట్లు పడ్డాయి. అయితే ఆత్మకూరు ఉపఎన్నికలో నైతిక విజయం తమదేనని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వీరోచిత పోరాటం చేసిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో…
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి భారీ మెజారిటీ రావడంపై మంత్రి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో టీడీపీ పోటీలో లేకున్నా కుట్రలు చేసిందని ఆరోపించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారని.. బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా ఉన్నారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల…
మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి భరత్‌పై వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 83వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు విజయంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు అధికారులు తరలించారు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కానుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 61.70% పోలింగ్ జరిగింది. 6…