ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు అని బండి సంజయ్ అన్నారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం.. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వండి.. అట్టడుగునున్న చివరి వ్యక్తికి కూడా అంత్యోదయ ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యం అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. లకిడీకాపూల్ లోని ఓ హోటల్ లో జరిగిన బీసీ మేధావుల సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Priyank Kharge: ప్రియాంక్ ఖర్గేకు కీలక ఐటీ శాఖ కేటాయింపు.. ఎంబీ పాటిల్‌కు ఆ శాఖ!
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకునే పార్టీలను, నాయకులను గుర్తించకపోతే బీసీలకు మరింత అణగారినవర్గాల వారుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీజేపీ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 27 మంది ఓబీసీలకు కేబినెట్ లో చోటు కల్పించిన చరిత్ర ఉందన్నారు. పార్టీ సంస్థాగత కమిటీల్లో బీసీలకు 30 శాతం పదవులు కేటాయించకపోతే.. వాటిని ఆమోదించే ప్రసక్తే ఉండదని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు బీసీ మంత్రులు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై బీసీల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారని బండి సంజయ్ చెప్పారు. బీసీల శక్తితోనే యూపీలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Read Also: United World Wrestling: భారత రెజ్లర్లకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజ్లర్లు మద్ధతు
అణగారినవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అత్యధికంగా ఉన్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. వారిని దృష్టిలో ఉంచుకునే ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని, నిలువనీడ లేని వారికి ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కార్యకర్త స్థాయి నుంచి వచ్చానని, అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని కాదన్నారు. కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ నాయకత్వం అప్పగించడం వల్లే అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు నిరంతరం తపన పడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. అందులో భాగంగానే ఏ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి సలహాలు స్వీకరిస్తామన్నారు.