United World Wrestling: భారత రెజ్లర్లకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజ్లర్లు మద్ధతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు దేశ వ్యాప్తంగా రెజ్లర్ల నిరసనపై పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి. నెల రోజులుగా భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకూ ఢిల్లీకే పరిమితమైన వారి అంశంపై.. ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీకి… యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజ్లర్లు మీకు మేమున్నమంటూ అండగా నిలబడుతోంది.
Read Also: Lady constable: ప్రయాణికురాలు ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్..
Also Read
బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు చేస్తూ కొన్ని రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ గోడును పట్టించుకునే వారే కరువయ్యారంటూ.. చివరకు వాళ్లు కష్టపడి సాధించిన పథకాలను కూడా గంగా నదిలో వేసేందుకు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆమరణ నిరాహార దీక్షకూ సిద్ధమయ్యారు. పథకాలు గంగలో కలిపేందుకు హరిద్వార్ కూడా వెళ్లారు. అక్కడ గంగానదిలో పతకాలను కలవబోతుండగా.. రైతు సంఘం నేతలు వచ్చి వారికి హామీ ఇచ్చారు. తమకు న్యాయం చేస్తామంటూ వారు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు తమ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు వాయిదా వేశారు రెజ్లర్లు. ఈ పరిణామాలన్నీ గమనించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను హెచ్చరించింది.
Read Also: Fresh Mutton: మీరు కొంటున్న మటన్ తాజాదేనా.?
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. అంతేకాకుండా బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపైనా ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. 45 రోజుల్లోగా రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుంటే.. ఆ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీరుతో ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను మరో చోటుకు తరలించే నిర్ణయం తీసుకున్నట్లు UWW ప్రకటించింది. ఇప్పటికైనా స్పందించకపోతే మున్ముందు భారీ మూల్యం తప్పదనేది UWW స్టేట్మెంట్ సారాంశం. మరీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ బాడీ ఎంట్రీతోనైనా రెజ్లర్ల వివాదానికి పరిష్కారం దొరుకుతుందా.. లేదంటే రెజ్లర్ల నిరసనలు ఇలానే కంటిన్యూ అవుతాయనేది చూడాల్సిందే.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!