తమ్ముడూ అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే పై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, రాజకీయ అరగ్రేటం చేసింది తన వల్లేనని భూమా అఖిలప్రియ అన్నారు. నువ్వు, నీ రహస్య మిత్రుడు, మా కోవర్ట్ కుమ్మక్కై నన్ను జైలుకు పంపారని అఖిలప్రియ ఆరోపించారు. 2014లో చక్రపాణి రెడ్డిని జగన్ కొత్తపల్లె వద్ద కారులో నుంచి దింపేశారు, కోవర్టు కూడా అక్కడే తన్నులు తిన్నాడని భూమా అఖిలప్రియ అన్నారు.
Read Also: Bhavatharini : ఇలియరాజా ఇంట విషాదం.. ఆయన కుమార్తె మృతి..
శిల్పా చక్రపాణి రెడ్డికి, అన్న మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని అఖిలప్రియ చెప్పారు. ఒకరికి మంత్రి పదవి రాకుండా మరొకరు అడ్డుకున్నారని తెలిపారు. ప్రతిరోజు భూమా నాగిరెడ్డి గుర్తుకు వచ్చేటట్లు చేస్తానని పేర్కొన్నారు. చక్రపాణి రెడ్డి అనుచరులు ముగ్గురు తనపై అత్యాచారం చేసారని జి.సి.పాలెంకు చెందిన ఓ ఒంటరి మహిళ ఆరోపించిందని.. తనకు అండగా ఉండి, న్యాయం చేస్తానని భూమా అఖిల ప్రియ చెప్పారు.
Read Also: Emmanuel Macron: యూపీఐతో “టీ” డబ్బులు చెల్లించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్.. వీడియో..