తమ్ముడూ అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే పై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, రాజకీయ అరగ్రేటం చేసింది తన వల్లేనని భూమా అఖిలప్రియ అన్నారు. నువ్వు, నీ రహస్య మిత్రుడు, మా కోవర్ట్ కుమ్మక్కై నన్ను జైలుకు పంపారని అఖిలప్రియ ఆరోపించారు. 2014లో చక్రపాణి రెడ్డిని జగన్ కొత్తపల్లె వద్ద కారులో నుంచి దింపేశారు, కోవర్టు కూడా అక్కడే తన్నులు తిన్నాడని భూమా అఖిలప్రియ అన్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 'రా కదలిరా' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సభలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో రాక్షసులు భయపడేలా పాలన ఉందని ఆరోపించారు. హిట్లర్ కూడా ఈ పాలన చూసి భయపడతారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పని లేదని భూమా అఖిలప్రియ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో గూండాల్ని తయారు చేశారని మండిపడ్డారు. గుండాలను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని అఖిలప్రియా దుయ్యబట్టారు.
ఇప్పటి వరకు అక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఒక్కటే. ఇప్పుడు సీన్ మారినట్టు కనిపిస్తోంది. ప్రత్యర్ధులు చేసే విమర్శలను సొంత ఫ్యామిలీయే చేస్తుండటంతో.. భూమా కుటుంబంలో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీలో ఉంటున్న ఆ నేత టీడీపీ సీటుకు గురిపెట్టారనే వార్తలు వస్తున్నాయి. అందుకే సొంత ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు టాక్. భూమా అఖిల వర్సెస్ భూమా కిశోర్‌రెడ్డికర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మొన్నటిదాకా రోడ్ల విస్తరణలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపణలు చేశారు.…
అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…