Budda Rajasekhar Reddy: రెండు రోజుల క్రితం శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై జరిగిన ఘటనపై ఇటు ప్రతిపక్ష పార్టీలో, అటు సొంత పార్టీలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీశైలంలో జరిగిన అటవీ అధికారుల దాడిపై తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వైస్సార్సీపీ నాయకులు అబంటీ రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం నియోజకవర్గం ఆయన సెటైర్లు వేశారు. శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో మద్యం…
తమ్ముడూ అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే పై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, రాజకీయ అరగ్రేటం చేసింది తన వల్లేనని భూమా అఖిలప్రియ అన్నారు. నువ్వు, నీ రహస్య మిత్రుడు, మా కోవర్ట్ కుమ్మక్కై నన్ను జైలుకు పంపారని అఖిలప్రియ ఆరోపించారు. 2014లో చక్రపాణి రెడ్డిని జగన్ కొత్తపల్లె వద్ద కారులో నుంచి దింపేశారు, కోవర్టు కూడా అక్కడే తన్నులు తిన్నాడని భూమా అఖిలప్రియ అన్నారు.