ఇందిరమ్మ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. 11వ తేదిన ఇంటిగ్రేడెడ్ పాఠశాలలకు శంఖుస్థాపన చేయనున్నామన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉంటుందని, ఎక్స్ట్రా కల్చరల్ ఆక్టివిటీస్, స్కూల్ లోనే థియేటర్ ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నార భట్టి విక్రమార్క. తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం కానున్నాయని, గత ప్రభుత్వం నెల వారీగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. ఉద్యోగ వ్యవస్థ దెబ్బ తిన్నదని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆయన వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై కూడా పెండింగ్ లేకుండా చూస్తామన్నారు. గతంలో నాసిరకం భోజనం పెట్టారని, స్కూల్స్ డైట్ బిల్స్ అన్నింటినీ రిలీజ్ చేశామని ఆయన తెలిపారు. ప్రతి నెల ఇక నుంచి రిలీజ్ చేస్తామన్నారు. గురుకులాలు ఎప్పుడు వచ్చాయా అందరికీ తెలుసు అని, ఇంకా మంచిగా వుంటే అభ్యంతరమా.. సలహాలునివ్వండన్నారు.
Ram Charan -Prashanth Neel: దానయ్య సమర్పించు ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్?
అంతేకాకుండా..’జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు పదేళ్ల పాటు అబద్దాలు చెప్పి చెప్పి అందరూ తమ లాగే ఉంటారనుకుంటున్నారు. మూసీ పై క్యాబినెట్లో చర్చపై మాట్లాడాలంటే ఇది కొత్త అంశం కాదు. కేబినెట్ లో చర్చలేకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా జరుగుతుంది. కేసీఆర్ లా ఒక్కరే నిర్ణయాలు చేయటానికి ఇక్కడ కుదరదు ఇదీ ప్రజా స్వామ్య ప్రభుత్వం. మూసీనీ శుద్ది చేసి నగరం నడిబొడ్డున స్వచ్చమైన మూసీ ప్రవహిస్తూ సుందరీకరణ చేయబోతున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి చేయలేదు మీకు ఆ కమిట్మెంట్ లేదు. మేము చేసి చూపిస్తాము. మూసీ నిర్వాసితుల కు ఎట్టిపరిస్దితులలో అన్యాయం జరగనీయం. వారికి అక్కడే నివాసాలు ఏర్పాటు చేస్తే జగదీష్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమిటి. మీలా మేము ఎవరినీ కలవనీయకుండా గడీలలో లేము.
Jaggery Benefits: బెల్లంతో గ్యాస్ ఉబ్బరాన్ని ఇలా పోగొట్టుకోవచ్చు!
మీరు సలహాలు ఇవ్వాలంటే రండి మాట్లాడదాము. పచ్చకామెర్లు ఉన్న వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపించిందని బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. లక్షా యాభైవేల కోట్లు అని ఎవరు డిసైడ్ చేశారు. ఇంకా డిపిఆర్ లే సిద్దం కాలేదు తప్పుడు ప్రచారాలు వద్దు. ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్క్యూల్స్ లో ఎస్సీ ఎస్టీ ల పిల్లలు అందరూ చదువుకుంటారు. ధాన్యం అక్రమాలు జరిగిన వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ధాన్యం అంతా ప్రభుత్వం, ప్రజలది. ధాన్యం అమ్ముకోవడం దుర్మార్గం. గత మూడేళ్ళ నుంచి జరీగుతుంది. గత ప్రభుత్వం వేల కోట్ల వ్యవహారం లో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం.. వంద శాతం చర్యలు వుంటాయి.. ‘ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.