నిన్నామొన్నటిదాకా గాజా-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికింది. ప్రస్తుతం నెమ్మదిగా ఉందనుకుంటున్న తరుణంలో కొత్త సంవత్సరంలో రెండు శక్తివంతమైన గల్ఫ్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక వైపు ఇరానీయుల నిరసనలతో అట్టుడుకుతుంటుంటే.. ఇంకోవైపు సౌదీ అరేబియా-యూఏఈ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యం రణరణంగా మారుతోంది.

యెమెన్‌లో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో చెరో వర్గానికి సౌదీ అరేబియా-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో యూఏఈ మద్దతుగల దళాలపై సౌదీ అరేబియా దాడులు చేసింది. ఈ ఘటనలో యూఏఈ మద్దతుగల యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే రెండు గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రస్తుతం యెమెన్ విషయంలో రెండు దేశాలు జోక్యం చేసుకుని స్నేహాన్ని చెడగొట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ ఏ పార్టీకి రిమోట్ కంట్రోల్ కాదు.. అన్ని మతాలను గౌరవిస్తాం
దక్షిణ, తూర్పు యెమెన్‌లను యెమెన్ ప్రభుత్వం (ఐఆర్‌జీ) పాలిస్తోంది. ఈ సంకీర్ణంలో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ) కీలక భాగస్వామి. అయితే స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఎస్టీసీ ముందుకు సాగడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయింది. డిసెంబరు నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది. హద్రామావత్ , అల్-మరాహ్ సహా పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఇంధన వనరులుగా ఉన్న ఈ భూభాగాలను ఆక్రమించడంతో యెమెన్‌లో అలజడికి కారణమైంది. ఇప్పుడు ఐఆర్‌జీకి సౌదీ మద్దతు ఇస్తుంటే.. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ)కి యూఏఈ మద్దతు ఇస్తోంది. ఇరు దేశాలు చెరొకదానికి మద్దతు ఇవ్వడం ఇప్పుడు ఘర్షణకు కారణమైంది. వాస్తవంగా యెమెన్ సమైక్యంగా ఉండాలని సౌదీ భావిస్తోంది.. కానీ ఎస్టీసీ మాత్రం ఆ ప్రయత్నానికి తూట్లు పొడుస్తోంది. ఈ క్రమంలోనే యూఏఈ మద్దతుగల ఎస్టీసీపై సౌదీ దాడులు చేసింది. ముందు.. ముందు ఎలాంటి ఉద్రికత్తలు చోటుచేసుకుంటాయో చూడాలి.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ఐసిస్ భారీ కుట్ర భగ్నం.. యువకుడు అరెస్ట్