Ravichandran Ashwin’s WTC Record: చెపాక్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్.. కాన్పూర్ టెస్టులోనూ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. దీంతో వరుసగా మూడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిళ్లలో 50 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా యాష్ నిలిచాడు. డబ్ల్యూటీసీ 2023-25లో ఇప్పటివరకు 50 వికెట్లు తీసిన అశ్విన్.. డబ్ల్యూటీసీ 2019-21 సీజన్‌లో 71 వికెట్లు, 2021-23 సీజన్‌లో…
టెస్టుల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త రికార్టు నెలకొల్పింది. అత్యల్ప బంతుల్లో 50 పరుగులు చేసింది. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ అరుదైన రికార్డును సాధించారు. దాంతో ఇంగ్లండ్ రికార్డు బద్దలైంది. గతంలో ఇంగ్లీష్ జట్టు 26 బంతుల్లో 50 రన్స్ చేసింది. భారత్ టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా ఇదే. రోహిత్…
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌటైంది. 74.2 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. మొమినల్ హక్ (107 నాటౌట్) సెంచరీ చేయగా.. నజ్ముల్ శాంటో (31), షద్మాన్ ఇస్లామ్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (20) పరుగులు చేశారు. భారత బౌలరు జస్ప్రీత్ బుమ్రా 3, మహమ్మద్ సిరాజ్ 2, ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో…
Mohammed Siraj Sensational Catch in Kanpur Test: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. హిట్‌మ్యాన్ సూపర్ క్యాచ్ అందుకున్న కాసేపటికే టీమిండియా పేసర్, మన హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసంతో మెరిశాడు. గాల్లో వెనక్కి డైవ్ చేస్తూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్…
Rohit Sharma Single Hand Catch: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మిడాఫ్‌లో ఊహించని క్యాచ్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. రోహిత్ గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్న తీరును చూసి.. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ సహా భారత ఆటగాళ్లు సైతం నోరెళ్లబెట్టారు. రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్…
Kanpur Test Session Timings: కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు ఎట్టకేలకు ప్రారంభం అయింది. నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే సాధ్యం కాగా.. రెండు, మూడు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. మూడోరోజైన ఆదివారం వర్షం లేకున్నా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా ఆట రద్దయింది. తొలి మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వరణుడు శాంతించడంతో నాలుగో…
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా రద్దైంది. రెండో రోజు మాదిరిగానే.. ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది. మూడో రోజైన ఆదివారం వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. మూడోసారి పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పిచ్, మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. మైదానం చిత్తడిగా…
IND vs BAN 2nd Test Day 3 Updates: కాన్పూర్ వేదికగా మొదలైన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మొదటి రోజు ఆటలో 35 ఓవర్లు మాత్రమే పడగా.. రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మూడో రోజైన ఆదివారం ఇంకా ఆట ఆరంభం కాలేదు. వర్షం పడుకున్నా.. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్ ఇంకా మొదలవ్వలేదు. మూడో రోజు ఆట మొదలవ్వడానికి మరింత ఆలస్యమవనుంది. ఇప్పటికే…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 16 ఏళ్లుగా అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. భారతదేశంలోనే కాదు.. దాయాది పాకిస్తాన్‌లో కూడా మనోడికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోసం ఫాన్స్ బారికేడ్లు దాటిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కోహ్లీ కాళ్లను తాకి తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై ఉన్న తన…
Rohit Sharma Selected Field after 9 Years in Tests in India: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత గడ్డపై జరిగే మ్యాచుల్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్లు బౌలింగ్‌ను తీసుకోవడం చాలా అరుదు. కానీ రోహిత్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చివరిసారిగా 2015లో అప్పటి సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై…