కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు గ్రామీణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వ్యక్తిగతంగా తనదే బాధ్యత అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇవాళ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి తన తమ్ముడు డీకే సురేశ్ ఓటమికి తాను వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఓటమి నుంచి కోలుకోవాల్సి ఉంది.. ఓడినంత మాత్రాన మౌనంగా ఉండబోమన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు ఒక్కటవుతాయని అనుకున్నాం.. కానీ, మైనారిటీల ఓట్లు మినహా బీజేపీ, జేడీఎస్ కార్యకర్తల ఓట్లు కాంగ్రెస్ కు పడలేదని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
Read Also: Nara Bhuvaneswari : స్టాక్ మార్కెట్ క్వీన్ గా నారా భువనేశ్వరి.. ఈ షేర్ తో 5 రోజుల్లో రూ.584 కోట్లు
ఇక, చెన్న పట్టణ ఎమ్మెల్యే స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డీకే సురేశ్ పోటీ చేసే విషయం ఇంకా ప్రస్తావనకు రాలేదని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటున్నామన్నారు. తనను నమ్మిన కార్యకర్తలు, ప్రజలకు శక్తిని నింపేలా మళ్లీ ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఎంతో మంది పెద్ద నాయకులే ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.. 14 స్థానాల్లో గెలుస్తామని అనుకున్నాం.. ఒక్కస్థానం నుంచి 9 స్థానాలకు పెరిగామని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు.
Read Also: Mrigasira Karthi: మృగశిర కార్తె రోజు చేపల పులుసు తినాల్సిందే..
కాగా, ఇంకా ఎక్కువ స్థానాల్లో రాష్ట్రంలో గెలిచేందుకు సాధ్యం కాలేదని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తన నియోజకవర్గ పరిధిలో డాక్టర్ సీఎన్ మంజునాథ్ గెలిచారు.. ఆయనను వ్యక్తిగతంగా అభినందించాను.. డీకే సురేశ్ బాగా పని చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు.. డాక్టర్ మంజునాథ్‌కు ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు గెలిపించారు.. కనకపురలో 60 వేల మెజారిటీ వస్తుందని భావించాం.. కానీ సాధ్యం కాలేదన్నారు. ఫలితాల ద్వారా ప్రజలు ఇచ్చిన సందేశాన్ని తాము అంగీకరిస్తామని డీకే శివ కుమార్ వెల్లడించారు.