శ్రియ శరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయా హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణను తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్న విషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ వైరల్ అయ్యింది.ఇక 2001లో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది.. ఇష్టం అనే టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రియ హీరోయిన్ గా నటించారు. ఆ మూవీతో శ్రీయా మంచి గుర్తింపు తెచ్చుకుంది.శ్రీయా కు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ గా అయింది.. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ హీరోయిన్ గా నటించారు.దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా మంచి విజయం సాధించింది.అక్కడ నుండి శ్రియ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు.
సౌత్ లో టాప్ స్టార్స్ అందరితో ను శ్రీయా నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.2018లో శ్రియ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుంది. శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు జన్మనిచ్చింది. తాను తల్లైన విషయాన్ని శ్రియ చాలా రోజులకు తెలియజేసింది.ఇటీవల ఈ భామ మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ అయితే పొందలేదు. రీసెంట్ గా ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.ఇప్పటికీ ఆమె క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.నటిగా కొనసాగుతూనే శ్రియ శరన్ అటు తన వ్యక్తిగత జీవితాన్ని చక్కగా బ్యాలన్స్ చేస్తుంది.ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా వెకేషన్ లో హాట్ ఫోటో షూట్స్ చేసి రెచ్చగొట్టింది.శ్రియా శరన్ తన హాట్ థైస్ హైలెట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.