2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి... కేవలం 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన వైసీపీ.... ఈసారి మాత్రం ఛాన్స్ తీసుకోదల్చుకోవడం లేదట. అంత ఓటమిలో కూడా... 40 శాతం వరకూ ఓట్లు పడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆ ఓట్ బ్యాంక్‌ని కాపాడుకుంటూ.... సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే.... మళ్ళీ పవర్‌లోకి రావడం ఖాయమని లెక్కలేసుకుంటోందట పార్టీ అధిష్టానం.
2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ‘జమిలి ఎన్నికలు’ అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలిపై ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో దాదాపు రూ.లక్ష కోట్లు…
Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని…
నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.
JPC First Meeting: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం ఈరోజు (జనవరి 8) జరగబోతుంది.
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం…
జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే, స్పీకర్ కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి.. ఎందుకంటే శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరు అనేది ఓంబిర్లా ప్రకటించాల్సి ఉంది.
One Nation One Election Bill: నేడు లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ” ఒకే దేశం, ఒకే ఎన్నికల ” బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లోక్‌సభలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లు’పై చర్చ జరుగుతోంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి. లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు…
Congress: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్‌లోని రూల్ 72 ప్రకారం రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టొద్దని డిమాండ్ చేశారు.
Jamili Elections: వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ఈరోజు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలు తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ విప్ జారీ చేశాయి. ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరాయి.