కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగులను టార్గెట్ గా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూకబ్జాలు, అవినీతితో గంగుల కోట్లు సంపాదించుకున్నారు. యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారు.. ఓట్ల కోసం ఓటుకు రూ.10 వేలతో పాటు యువతకు 5 వేల సెల్ ఫోన్లు పంచేందుకు సిద్ధమైండు అని ఆయన ఆరోపించారు. గంగులకు ఓటమి ఖాయమని కేసీఆర్ కు ఎప్పుడో తెలుసు.. అందుకే చాలా రోజులు బీ-ఫాం ఇవ్వని కేసీఆర్.. ఒవైసీ దగ్గరకు పోయి గెలిస్తే కరీంనగర్ మేయర్ పదవి ఎంఐఎంకు ఇస్తానని హామీ ఇచ్చి గంగుల టిక్కెట్ తెచ్చుకున్నాడు అని బండి సంజయ్ అన్నారు.
Read Also: Malaika Arora : చూపు తిప్పుకొని అందం.. డీప్ బ్యాక్ తో అందాల రచ్చ చేస్తున్న మలైక..
నన్ను ఎదుర్కొనే దమ్ములేక ఒవైసీతో కలిసి ఓడించే కుట్ర గంగుల చేస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. పొరపాటున గంగుల గెలిస్తే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి లేదు.. కరీంనగర్ ప్రజలారా.. ఓటు బ్యాంకుగా మారి సత్తా చాటండి.. కరీంనగర్ గడ్డపై ఏ జెండా ఎగరేలో మీరే తేల్చుకోండి.. ఓటు బ్యాంకు చీల్చి కేసీఆర్ కు మేలు చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది.. భూకబ్జాలు తప్ప కాంగ్రెస్ చేసిందేమిటి?.. బస్తీ దవాఖానాసహా అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే అని ఆయన పేర్కొన్నారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ, రోడ్ల విస్తరణ పనులు, స్మార్ట్ సిటీసహా నిధులన్నీ నేను తెచ్చినవే.. కష్టపడి నేను నిధులు తీసుకొస్తే.. గంగుల ఫోటోలు పెట్టుకుట్టుకుని ఊరేగుతున్నాడు.. మందికి పుట్టిన పిల్లలను తమ పిల్లలుగా చెప్పుకునే రకం గంగుల.. గంగుల భాగోతం తెలిసి ఈసడించుకుంటున్న జనం అని బండి సంజయ్ అన్నారు.
Read Also: Business Idea: చలికాలంలో అదిరిపోయే బిజినెస్.. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు..
కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా పేదలకు కట్టివ్వని దుర్మార్గుడు అని బండి సంజయ్ అన్నారు. ఆ శాఖకు మంత్రి గంగులే కదా…. కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఎందుకివ్వలేదు?.. గంగుల మళ్లీ గెలిస్తే జీతాలు, ఫించన్లు రావు.. నేను నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే యుద్దం చేసిన.. మా అత్త చనిపోతే ఇంటికొస్తే కేసీఆర్, గంగుల కుట్ర చేసి అర్ధరాత్రి నా ఇంటిపై దాడి చేయించి జైలుకు పంపారు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాను అని బండి సంజయ్ తేల్చి చెప్పారు.