Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజాకార్లు, మజ్లిస్ పార్టీ ఎలాంటి దుర్మార్గాలు చేశారో అందరికీ తెలుసునని, అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీ కి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు జి హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని అన్నారు. ఈ సంగతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించిందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్…
MIM MLA: మజ్లీస్ పార్టీకి చెందిన బహదూర్ పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ రెచ్చిపోయారు. ఓ ప్రార్థన మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.
రాజేంద్రనగర్ లోని శాస్త్రిపురం వట్టేపల్లిలోని సెంట్ ఫాయజ్ పోలింగ్ బూత్ నంబర్ 400లో తన ఓటు హక్కును ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. శాస్త్రిపురంలో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను..
కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగులను టార్గెట్ గా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూకబ్జాలు, అవినీతితో గంగుల కోట్లు సంపాదించుకున్నారు. యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారు.. ఓట్ల కోసం ఓటుకు రూ.10 వేలతో పాటు యువతకు 5 వేల సెల్ ఫోన్లు పంచేందుకు సిద్ధమైండు అని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేది.. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారు.. ఏమైనా అంటే బదిలీలు చేస్తామని బెదిరిస్తున్నారు.. ఇలాంటి వారికి తగిన ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ఆయన చెప్పుకొచ్చారు. Read Also: Muralidhar Rao: వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం…
చంద్రయాణాగుట్ట ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తాము చెప్పినట్లు వినాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యనించారు.
Asaduddin Owaisi assault case అసదుద్దీన్ ఓవైసీ హత్యా నిందితులకు బెయిల్.. యూపీ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టుఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ పర్యటిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై ఇద్దరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు తాజగా బెయిల్ లభించింది. అయితే వారికి బెయిల్ లభించడాన్ని సవాల్ చేస్తూ అసదుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్…
MIM Party: జాతీయ రాజకీయ పార్టీ రేంజ్లో దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆశిస్తున్న హైదరాబాద్ లోకల్ పొలిటికల్ పార్టీ ఎంఐఎం.. మధ్యప్రదేశ్లో తన ప్రయాణాన్ని మస్తుగా షురూ జేసింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. బీజేపీ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో ఎంఐఎం లేటెస్టుగా లోకల్ బాడీ ఎలక్షన్లో అకౌంట్ ఓపెన్ చేసింది. జబల్పూర్, బుర్హాన్పూర్, ఖంద్వా పట్టణాల్లో నాలుగు వార్డులను కైవసం చేసుకుంది. జబల్పూర్ మునిసిపాలిటీలో ఇద్దరు, మిగతా రెండు చోట్ల ఒక్కరు చొప్పున…