కరీంనగర్ లో తన పార్లమెంట్ ఆఫీస్, ఇంటి దగ్గర ఎంఐఎం కార్యకర్తలు దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించాడు. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీ పార్టీని ఎదుర్కోలేక పోతుంది అంటూ మండిపడ్డాడు. బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు.. దాడి జరిగింది అని బీజేపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే బీజేపీ కార్యకర్తల పైనే పోలీసులు కేసులు పెడుతున్నారు.. ఎంఐఎం దేశ ద్రోహుల పార్టీ అంటూ ఆయన విమర్శించారు. తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. భాగ్యలక్ష్మీ గుడి వద్ద జనగణమన, వందే మాతరం పాడే దమ్ము బీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు ఉందా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిజాం వారసులం కాదు అని బీఆర్ఎస్ నిరూపించుకోవాలి.. బీజేపీ దాడులకు భయపడదు.. మా సహనాన్ని పరీక్షించ వద్దు.. మమ్మల్ని రెచ్చ గొట్టొద్దు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: MS Dhoni: మహీ భాయ్ ఐ లవ్ యూ.. అభిమాని పిలుపుకు మిస్టర్ కూల్ ఎలా స్పందించాడంటే..!
తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించాడు. ‘‘ మీరు దేశభక్తులా…. ఏ దేశానికి? పాకిస్తాన్ కా… ఆఫ్ఘనిస్తాన్ కా?’’అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు.. తెలంగాణలో, కరీంనగర్ లో ప్రశాంతంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నాం.. కానీ బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ కలిసి విధ్వంసం సృష్టించాలని కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. అసలు ఎవరు ఎవరి ఇండ్లపైకి, ఆఫీసులపైకి వెళ్లారు? మా బీజేపీ కార్యకర్తలేమైనా దారుస్సలాం ఎంఐఎం ఆఫీస్ పై దాడికి పోయారా? ఎంఐఎం కార్యకర్తల ఇళ్లపై దాడులకు పోయారా?.. మా ధైర్యాన్ని, సాహసాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్… దారుస్సలాంపై జెండా ఎగరేస్తాం అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.
Read Also: Archana Gautam: నటి అర్చనపై దాడి.. జుట్టు లాగి అసభ్య ప్రవర్తన!
బీఆర్ఎస్ పార్టీ అండ చూసుకుని అక్బరుద్దీన్ ఒవైసీ ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎం చెప్పినట్లే వినాలి.. మేం చెప్పినట్లే నడవాలి అని అన్నాడు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యనించాడు. మీరు చెప్పినట్లు ఆడటానికి మాది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కాదు… అణువుణా దేశభక్తిని నింపుకుని ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాషాయ జెండా పట్టుకుని తెగించి కొట్లాడే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను నాశనం చేసేందుకు ఎంఐఎం కుట్రలు చేస్తున్నా నోరు మెదపరా? పాతబస్తీ ప్రజలు దశాబ్దాల తరబడి పేదరికంలోనే మగ్గుతున్నా పట్టించుకోరా? ఓల్డ్ సిటీ న్యూసిటీ కాకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకోరా? అని ఆయన తెలిపారు.