Archana Gautam: నటి అర్చనపై దాడి.. జుట్టు లాగి అసభ్య ప్రవర్తన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Archana Gautam Got Beaten At Congress Office In New Delhi: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన అర్చన మీద దాడి జరిగిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ఆమె తెలుగు అర్చన కాదండోయ్ హిందీ బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్. రియాల్టీ షో బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అర్చన గౌతమ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, మాజీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, నటి అర్చన గౌతమ్ 29 సెప్టెంబర్ 2023న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె తండ్రి కూడా నటితో ఉన్నారు. తండ్రితో పాటు అర్చన గౌతమ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు మహిళలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు, జుట్టు లాగి కూడా తోస్తూ చాలా మంది వారితో అసభ్యంగా కూడా ప్రవర్తించారు. రిజర్వేషన్ బిల్లుపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంక గాంధీని అభినందించేందుకు వచ్చిన తనపై దాడి జరిగిందని అర్చన గౌతమ్ ఆరోపించారు.
Anushka Sharma: మళ్ళీ తల్లి కాబోతున్న అనుష్క?
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఇంత ప్రయత్నించినా ఆమెకు కానీ ఆమె తండ్రికి కానీ అక్కడ ప్రవేశం లభించలేదు. అయితే మీడియాతో మాట్లాడేందుకు అర్చన నిరాకరించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ నేను ఇంకా పోరాడతాను, నేను ఇలా నిశ్శబ్దంగా కూర్చోవడం లేదు, నాకు ఏది జరిగినా అది చాలా తప్పు అని ఆమె పేర్కొంది. ఈ కేసులో అర్చన గౌతమ్, ఆమె తండ్రిపై 30 సెప్టెంబర్ 2023న మీరట్‌లో కేసు నమోదు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా మార్చి నెలలో, అర్చన గౌతమ్ తండ్రి మీరట్‌లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక గాంధీ వాద్రా PA అంటే ప్రైవేట్ సెక్రటరీ సందీప్ సింగ్‌పై కేసు పెట్టారు. అప్పుడు సందీప్ సింగ్ తన కూతురు అర్చనను చంపేస్తానని బెదిరించాడని ఆమె తండ్రి ఆరోపించారు, నటిని జైల్లో పెడతానని బెదిరించాడని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..