బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికల వేళ జాన్ సూరాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కీలక సలహా ఇచ్చారు.
జూబ్లీహిల్స్‌లో మజ్లిస్-బీజేపీ మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరిగింది. జిల్లా నేతలకు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశానికి రామచందర్‌రావు, కిషన్‌రెడ్డి హాజరై డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, ఎంఐఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగర్ వీధులు కాంగ్రెస్, ఎంఐఎం ఎంతగా దిగజారిన రాజకీయం చేస్తున్నాయో సాక్ష్యం చెబుతున్నాయన్నారు. బీజేపీ & ఎంఐఎం ఒక్కటే అని రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటూ తిరిగారు – కానీ జూబ్లీహిల్స్‌లో, ఒవైసీ బహిరంగంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఒక్కసారిగా అభ్యంతరం లేకుండా పోయిందా? ఇది డొల్లతనం కాకపోతే మరేమిటి? అని ప్రశ్నించారు. Also Read:Gujarat Cabinet 2025: గుజరాత్…
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం తమదే అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. మాగంటి…
Bandi Sanjay: మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు.
Minister Ponnam: ఢిల్లీలో అఖిల భారత నాయకత్వంతో కీలక సమావేశాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న ఖర్గే నివాసంలో తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది.. భారత్ జోడో యాత్రలో అసమానతలు గమనించి కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా సైన్యం వైమానిక దాడులను ఖండించారు. అనంతరం పాకిస్థాన్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్…
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.