Mahesh Babu: టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు.. మొదటి భార్య అనిత చనిపోయాక అతను తేజస్విని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె గతేడాది ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక దిల్ రాజు మొదటిభార్య అనిత కు పుట్టిన కుమార్తె హర్షిత రెడ్డి గురించి అందరికి తెల్సిందే. ఆమె .. తన తండ్రికి దగ్గర ఉండి రెండో పెళ్లి చేయించింది. తన కుమారుడు మొదటి పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుతున్న విషయం తెల్సిందే. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ కు టాలీవుడ్ మొత్తం హాజరుకానుంది. ఈ వేడుకకు హాజరయిన వారి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వేడుకలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన కుమార్తె సితార.
Suhas: రైటర్ పద్మభూషణ్.. ఈసారి ‘శ్రీరంగ నీతులు’ చెప్తాడట
ఎక్కడికి వెళ్లినా భార్య నమ్రతతో వచ్చే మహేష్.. ఈ వేడుకకు మాత్రం కుమార్తె సితారతో వచ్చాడు. ఇక వీరిద్దరే ప్రస్తుతం ఫంక్షన్ లో హైలైట్ గా నిలిచారు. ఇద్దరు వైట్ కలర్ డ్రెస్ ల్లో అదరగొట్టారు. మహేష్ వైట్ కలర్ షర్ట్ లో కనిపించగా.. సీతూపాప.. వైట్ టైట్ డ్రెస్ లో మెరిపించింది. ఇక తండ్రీకూతుళ్ళు పక్కపక్కన నడుస్తుంటే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. ఎంతో జాగ్రత్తగా సితార చెయ్యిపట్టుకొని మహేష్ తీసుకువెళ్లడం చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.