హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, ఆలయ పూజారులు, అధికారులు గుట్టపై వున్న శివాలయం శిథిలావస్థలో వుందని తెలిపారు. దీంతో.. ఎంపీ నిధులు నుండి కొండపైన ఉన్న గుడి అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అయోధ్య రాముడి అక్షింతలపై రాజకీయం చేస్తున్నమంటున్న వారి మాటలను, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు బండి సంజయ్. అక్షింతల కార్యక్రమం కేవలం బిజెపి పార్టీది కాదు అన్ని పార్టీలకు అతీతం, వారికి కూడా ఆహ్వానం పంపామని ఆయన వెల్లడించారు. కేటీఆర్ కు ఉన్న అహంకారం మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఉందని, బీఆర్‌ఎస్ వాళ్ళు ఎది మాట్లాడితే మంత్రి పొన్నం ప్రభాకర్ అదే మాట్లాడుతాడన్నారు. కేటీఆర్ వల్ల బీఆర్‌ఎస్ ఎలా నాశనం అయిందో, రేపు పొన్నం ప్రభాకర్ అహంకార మాటలతో కాంగ్రెస్ పార్టీ అలాగే నాశనం అవుతుందని, నేను సంస్కారంతో మాట్లాడుతున్న, పొన్నం ప్రభాకర్ కూడా పోలైట్ గా మాట్లాడాలన్నారు బండి సంజయ్. బీఆర్‌ఎస్ నాయకుల దృష్టిలో నా కొడుకులు మంచి బట్టలు వేసు కోవద్దు, నా కొడుకులపై చిల్లర రాజకీయం చేస్తున్నారని, వారి వ్యవహార శైలితో బాధ కలుగుతుందన్నారు.
కార్యకర్త కోరిక మేరకు ఓ కారు ప్రారంభం చేస్తే, వాళ్ళు బండి సంజయ్ దే అని ముడిపెట్టి చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. పొన్నం ప్రభాకర్ మీద ఎన్ని కేసులు వున్నాయి, నా పై 100 కు పైగా కేసులు వున్నాయని, పొన్నం ప్రభాకర్ అధికారంలో వున్నం కదా అని అహంకారంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ది చెప్తారన్నారు. కేంద్ర నాయకత్వం ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడే పోటీ చేస్తా, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలువ బోతున్నం, గల్లీలో ఏ పార్టీ వున్న కేంద్రంలో మాత్రం మోడీ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఎన్నికల వరకే రాజకీయం మాట్లాడాలి కాని, తరువాత అభివృద్ధి కోసం మాత్రమే పని చేయాలని ప్రధాని మోడీ సూచించారని బండి సంజయ్ అన్నారు.