రేపు మూడో దశ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో వరంగల్‌లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్‌లో ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టులో ఆశ్రయించి పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే.. దీనిపై బీజేపీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతులను జారీ చేసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ కుటుంబం పై ఆరోపణలు రావడం తోనే కుట్రలు చేసిన ధర్మం గెలిచిందన్నారు. హైకోర్టు ను లో పొరాడాం గెలిచామని, యాత్ర జరిగితే కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు పై చర్చ జరుగుతోంది అని భయపడ్డారన్నారు. జేపీ నడ్డా పాల్గొనే సభ అనుమతి తీసుకున్నామని, పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం.. అయినా ఏకధాటిగా వచ్చి మీ పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్పారన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో డబ్బులు వాపస్ పంపారని, పర్మిషన్ రద్దుకు కారణం లేదని, మరలా హైకోర్టును ఆశ్రయిస్తే పర్మిషన్ వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్ళా సీపీ ఏదో చట్టం చెప్పి అడ్డుకుందామని చూస్తున్నారన్నారు. రేపు జరిగే బహిరంగ సభకు అనుమతి వచ్చిందని, ప్రజాస్వామ్య బద్దంగా మా హక్కులతో అన్ని నిర్వహించుకుంటామన్నారు. హైకోర్టు తీర్పు మాకు సంతోషం వచ్చింది.. ముఖ్యమంత్రి ఇక పండుగ చేసుకో.. నిర్బంధం కు వ్యతిరేకంగా తెలంగాణ లో బీజేపి పోరాడుతుంది. ప్రజలు గుర్తించారు మాకు మద్దతుగా తరలి వస్తున్నారు. యుద్ధం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి దొంగదారిలో అడ్డుకునే ప్రయత్నం చేసినా కోర్టులో ధర్మం గెలిచింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మవారి ని దర్శించుకుని పాదయాత్ర ముగించాలని అనుకున్నాం దానికోసం ప్రయత్నిస్తాం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.