విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులతో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను చైర్మన్, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి, తదితరులు ముఖ్యమంత్రికి అందించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది.
Read Also: Nikhat Khan : లూసిఫర్2లో అమీర్ ఖాన్ సోదరి
ఈ క్రమంలో.. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నియోజకవర్గాలవారీగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ కు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల నిర్వహణ సమస్యలను కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Sankrantiki Vastunnam : ఓటీటీ, టీవీలో ఒకేసారి రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం