ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్సే, సావర్కర్‌ల బిడ్డలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన విమర్శించారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మన పెద్దలు గళం విప్పారని చెప్పారు. తుర్రేబాజ్ ఖాన్ కాల్చి చంపబడ్డాడు.. అతను భారతదేశాన్ని స్వేచ్ఛగా చూడాలనుకున్నాడు అని తెలిపారు. హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చరిత్ర లేదు.. బీజేపీ కొత్త సృష్టి.. మజ్లిస్‌కు అనుకూలంగా మాట్లాడే అర్హత వీరికి లేదని ఓవైసీ అన్నారు.
Read Also: Nithya Menen: ‘కుమారి శ్రీమతి’గా నిత్యా మీనన్ – ఎక్కడ, ఎందులో చూడాలంటే?
భారత్, పాకిస్థాన్ విభజనను ప్రస్తావిస్తూ.. రజాకార్లుగా ఉన్నవారు పాకిస్థాన్‌కు పారిపోయారని, విశ్వాసపాత్రులైన వారే ఇక్కడ పోరాడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మీ బుల్లెట్లు అయిపోతాయని ఒవైసీ చెప్పారు. నాథూరామ్ గాడ్సే, వినాయక్ దామోదర్ సావర్కర్ వెళ్లిపోయారు.. కానీ వారి పిల్లలు ఇక్కడే ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు వారిని కూడా తరిమికొట్టే సమయం వచ్చింది.. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో మాట్లాడుతూ.. ‘నేషన్ ఫస్ట్’ సూత్రాన్ని అనుసరించి, హైదరాబాద్ పోలీస్ యాక్షన్ ప్లాన్ చేసి, నిజాం రజాకార్ల సైన్యాన్ని రక్తపాతం లేకుండా లొంగిపోవాలని కోరింది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ అని అన్నారు.. అమిత్ షా చేసిన ఈ ప్రకటనకు కౌంటర్ గా ఓవైసీ బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
Read Also: AP Students in USA: అమెరికా గడ్డపై ఏపీ విద్యార్థులు.. కొలంబో వర్సిటీ సెమినార్‌లో ప్రసంగం