D. Raja Warns RSS: విజయవాడలో సీపీఐ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మీట్ ది ప్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాలలో NDA రావడంపై ఇప్పటికే ఆందోళనలో ఉన్నారని అన్నారు.
Priyank Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ పంచాయతీ కొనసాగుతోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ ర్యాలీల అనుమతులను నిరాకరించడంపై వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ సీనియర్ నేతల పిల్లలు హస్టల్ విద్యార్థులను ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌కు హాజరుకావాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఇతరులకు వర్తించే చట్టాలు ఆ సంస్థలకు ఎందుకు వర్తించవు అని ప్రశ్నించారు.
Mallikarjun Kharge: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను దేశంలో నిషేధించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడాన్ని నిషేధించాలని అన్నారని ఖర్గే గుర్తు చేశారు. 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, దానిని తిరిగి అమలు చేయాలని కోరారు. ‘‘ఆర్ఎస్ఎస్ను నిషేధించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని ఖర్గే శుక్రవారం అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆయన విషంతో పోల్చారు
Karnataka: కర్ణాటక చిత్తాపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది. ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R)…
Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ముడిపెడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇది కులం పేరుతో మానవత్వాన్ని నలిపేస్తున్న ‘తీవ్రమవుతున్న సామాజిక విషానికి’ చిహ్నంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ వేదికగా వరస ట్వీట్లలో సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఎంపిక చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జేపీ నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
కొద్దిరోజుల క్రితం మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని రాజకీయం నడుస్తున్న ఈరోజుల్లో ఏకంగా 2047 దాకా మోడీనే దేశానికి ప్రధానిగా ఉంటారన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబులిటీ గురించి ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటిదాకా ఉండేదెవరు, ఊడేదెవరూ అనే కామెంట్లు…
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.