ప్రతిరోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ అయితే సాంప్రదాయం అని క్రమం తప్పకుండా రోజు స్నానం చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో స్నానం పవిత్రంగా భావిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి హాని కలుగజేస్తుందట. అంతేకాకుండా.. రోగనిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలోనైతే రోజూ తలస్నానం చేయడం తగ్గించుకోవడం చాలా మంచిదని చర్మ నిపుణులు అంటున్నారు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల మన చర్మానికి హాని కలుగుతుందని వారు తెలుపుతున్నారు.
LIC Super Scheme: మహిళలకు అదిరిపోయే స్కీమ్.. కేవలం రూ.29 కడితే, రూ. 4 లక్షలు పొందవచ్చు..
చర్మం పొడిబారే అవకాశం
చలికాలంలో ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడినీళ్లతో స్నానం చేస్తే హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. వేడినీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. దాంతో శరీరంలో ఉండే సహజ నూనెను తొలగిస్తుంది. మన శరీరంలో ఉండే ఈ సహజ నూనె రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. అందువల్ల ఈ నూనె మిమ్మల్ని తేమగా, రక్షణగా ఉంచుతుందని సైన్స్ చెబుతోంది. అంతేకాకుండా.. అధిక స్నానం చేయడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి జెర్మ్స్, వైరస్‍తో పోరాడలేకపోతుంది. దీంతో శరీరం బలహీనమవుతుంది.
గోర్లు దెబ్బతింటాయి
ప్రతిరోజూ వేడి నీటితో స్నానం మంచిది కాదు. దాని వల్ల ఎక్కువగా గోర్లు దెబ్బతినే అవకాశం ఉంది. స్నానం చేసేటప్పుడు గోళ్లు నీటిని పీల్చుకుంటాయి. దాంతో వాటి సహజ రూపాన్ని కోల్పోయి విరిగిపోతాయి. అందువలన మీరు ప్రతిరోజూ స్నానానికి దూరంగా ఉండాలి. రోజు విడిచి రోజు చేస్తే మంచిది.
Minister KTR: హిందూ-ముస్లింలకు గొడవలు పెట్టేవాళ్ళ డిపాజిట్ గల్లంతు కావాలి..
ఓ సర్వే ప్రకారం.. ప్రజలు ఎక్కువగా స్నానం చేసే దేశాలలో భారతదేశం, జపాన్, ఇండోనేషియా ముందు వరుసలో ఉన్నాయి. అయితే మనం రోజూ స్నానం చేయడం వల్ల నీరు వృథా కావడమే కాకుండా శారీరకంగా, మానసికంగా కూడా హానికరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. స్నానపు అలవాట్లు కూడా వ్యక్తి మానసిక స్థితి, ఉష్ణోగ్రత, వాతావరణం, లింగం, సామాజిక ఒత్తిడిపైన ఆధారపడి ఉంటాయి. సామాజిక ఒత్తిడి కారణంగా రోజూ స్నానం చేస్తుంటారు. అయితే దీన్ని బట్టి మీరు రోజూ స్నానం చేస్తారో.. రోజు విడిచి రోజు చేస్తారో మీరే ఆలోచించుకోండి.