ప్రజల ఆదరాభిమానాలను పొందిన అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమాతో పాటు సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది.. ఎన్నో పథకాలు మంచి లాభాలను అందిస్తున్నాయి.. అందులో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కిమ్స్ ఉన్నాయి.. ఎల్ఐసీ ఆధార్ శీలా కూడా ఒకటి..సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్, ఇది హామీతో కూడిన రాబడి, జీవిత బీమా రెండింటినీ అందిస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు గల మహిళలు ఈ స్కీమ్ ఓపెన్ చేయవచ్చు.. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్కీమ్ తీసుకొనే మహిళలు ముందుకు కాలాన్ని ఎంచుకోవాలి.. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. ఇందులో మినిమమ్ రూ.75,000, మాగ్జిమమ్ రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ కనీస మెచూరిటీ టైమ్ 10 ఏళ్లు, గరిష్ఠ వ్యవధి 20 ఏళ్లు. ఎంచుకున్న వ్యవధి ముగింపులో, పథకం పెట్టుబడి పెట్టబడిన మొత్తాన్ని, బోనస్ గా తిరిగి చెల్లిస్తుంది..
ఈ స్కీమ్ లో చేరే ఆడవాళ్లకు 30 ఏళ్లు ఉండి 20 ఏళ్ల పాటు రోజుకు రూ.29 పెట్టుబడి పెడితే, ఈ స్కీమ్ టెన్యూర్‌లో మొత్తం రూ.2,11,170 చెల్లించాల్సి వస్తుంది. అయితే, 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.4 లక్షలు లభిస్తాయి. అంటే పెట్టుబడి నుంచి రూ.1.88 లక్షల లాభాన్ని సొంతం చేసుకోవచ్చు.. ఈ స్కీమ్ లో చేరాలనుకొనే మహిళలు ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా మాత్రమే అవసరమవుతాయి. సౌలభ్యం ప్రకారం మీ ప్రీమియంలను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు.. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే దగ్గరలోని ఎల్ఐసీ బ్రాంచ్ లో సంప్రదించవచ్చు..