బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్ కు తీసిపోని జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ భయం ఇంకా వెంటాడుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ జాబ్స్ కోసం ట్రై చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1.6 లక్షల జీతం అందుకోవచ్చు. ఈ గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read: Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో పాటకి డేట్ లాక్ ?
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూనియర్ టెక్నికల్ మేనేజర్, అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వంటి పోస్టులు భర్తీకానున్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి బి.ఇ./బి. టెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), వ్యక్తిగత ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
Also Read: YS Jagan: చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు..! జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఎంపికైన వారికి నెలకు జూనియర్ టెక్నికల్ మేనేజర్ (సివిల్) రూ. 40,000 – రూ. 1,40,000, జూనియర్ టెక్నికల్ మేనేజర్ (ఎలక్ట్రికల్) రూ. 40,000 – రూ. 1,40,000, జూనియర్ టెక్నికల్ మేనేజర్ (SNT) రూ. 40,000 – రూ. 1,40,000, జూనియర్ టెక్నికల్ మేనేజర్ (RS) రూ. 40,000 – రూ. 1,40,000, అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ (ఆర్కిటెక్చర్) రూ. 50,000 – రూ. 1,60,000, అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) రూ. 50,000 – రూ. 1,60,000, అసిస్టెంట్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) రూ. 50,000 – రూ. 1,60,000, అసిస్టెంట్ మేనేజర్ (జనరల్) రూ. 50,000 – రూ. 1,60,000 లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 24 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.