అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరు. తెరపై కనింపించి చాలా కాలం అవుతున్న పవన్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు. ఇక రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అందులో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్ర లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఏప్రిల్ 14 లోపు తనకు సంబంధించిన పోర్షన్‌ను పూర్తి చేసేందుకు పవన్ కల్యాణ్ డేట్స్ ఇచ్చారట. ఆయన కేటాయించిన డేట్స్‌లో సినిమాలోని కీలక సన్నివేశాలను పూర్తి చేయనున్నారట.
Also Read: Mirai : తేజ సజ్జ ‘మిరాయ్’ల్లో దగ్గుబాటి హీరో..
పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కాగా దీనిపై భారీ హైప్ నెలకొంది. కానీ ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుండడంతో ఒకింత అంచనాలు తగ్గుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ మార్చి నుంచి మే నెలకి షిఫ్ట్ అవ్వడం తో పాటుగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు నమ్మకం అందించాయి. ఇక ఈ చిత్రం నుండి మూడో పాట రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినపడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ 10న మూడో సాంగ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 4వ పాటను ఏప్రిల్ 15న రిలీజ్ చేస్తున్నారట. ఈ రెండు పాటల్లో ఒకటి మాస్ డ్యాన్స్ కూడిన సాంగ్, మరో మెలోడీగా సాగే సాంగ్ అని సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.