Municipal Staff Strike: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోనూ ఉంది.. తమ డిమాండ్ల సాధన కోసం మొండుపట్టుపట్టారు కార్మికులు.. వారికి అండగా నిలిచాయి కార్మిక సంఘాలు.. అయితే, నేడు మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది ప్రభుత్వం.. సచివాలయంలోని సెకెండ్ బ్లాక్ లో జీవీఎంతో సమావేశం కానున్నారు కార్మిక సంఘాల నేతలు.. సమాన పనికి సమాన వేతనం పై పట్టుబడుడుతోంది సీఐటీయూ.. మున్సిపల్ వర్కర్స్ పలు డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పట్టికీ.. అన్ని డిమాండ్‌పై చర్చలు కొనసాగుతున్నాయి.. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు మరికొన్ని క్యాటగిరీలకు కూడా ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, శానిటేషన్ వెహికల్ డ్రైవర్స్, మలేరియా వర్కర్స్ కు నెలకు 6 వేల రూపాయల ఓహెచ్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది..
Read Also: Breaking: బెగుసరాయ్‌లో షార్ట్ సర్క్యూట్.. నలుగురు సజీవ దహనం
అయితే, సమ్మెలో ఉన్న సీఐటీయూ, సమ్మె నోటీసిచ్చిన వివిధ మున్సిపల్ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు సాగనున్నాయి.. మున్సిపాల్టీల్లో పని చేసే వివిధ వర్గాలకు రూ. 6 వేల మేర హెల్త్ అలవెన్స్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు.. కానీ, ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కార్మిక సంఘాల అసంతృప్తితో ఉన్నాయి.. కొన్ని వర్గాలకు మాత్రమే అలవెన్స్ ఇచ్చి. మరికొన్ని వర్గాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తున్నాయి కార్మిక సంఘాలు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి తీరాల్సిందేనని పట్టు పడుతోన్న కార్మిక సంఘాలు. వేతనాన్నైనా పెంచాలి.. లేదా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రైగులరైజ్ చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.. మరోవైపు.. సమ్మె విరమింప చేయాలని ప్రయత్నిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇప్పటికే హెల్త్ అలవెన్స్ పెంచుతూ జీవో జారీ చేశామని గుర్తు చేస్తోంది.. సమ్మె విరమించి విధుల్లో చేరాలని కార్మిక సంఘాలను కోరుతున్నారు మంత్రులు.
Read Also: Telangana schools: స్కూళ్లలో ఫేస్ రికగ్నిషన్ హాజరు.. విద్యాశాఖ కీలక నిర్ణయం
ఇక, సచివాలయానికి చేరుకున్న మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. వేరే వాళ్లతో పని చేయిస్తూ ప్రభుత్వం సమ్మెను అణిచి వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు రెండో విడత మమ్మల్ని చర్చలకు పిలిచారు. మమ్మల్ని రెచ్చగొట్టేలా కార్మికులకు పోటీగా పని చేయిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం, కార్మికుల రెగ్యులరైజేషన్ ఇవే ప్రధాన డిమాండ్లుగా స్పష్టం చేశారు సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు.. తొలి విడత చర్చల్లో కూడా ఇవే డిమాండ్లే చెప్పాం.. వారు కాదన్నారు. సమాన పనికి సమాన వేతనం అనేది జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్ చెప్పిందే. పబ్లిక్ హెల్త్ పరిధిలో వచ్చే వాళ్లల్లో కొంతమందికే రూ. 6 వేల అలవెన్స్ ప్రకటించారు. మిగతా కార్మికులు ఏం పాపం చేశారు..? కార్మికులను విడగొట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందా..? మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మె ఆగేది లేదు. ప్రభుత్వం నిర్ణయం బట్టి మా కార్యాచరణ ఉంటుందని తెలిపారు ఉమామహేశ్వరరావు.