Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. “మీ పాలనలో చిరు ఉద్యోగుల దుస్థితి దారుణంగా తయారైంది. వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు,” అని హరీష్ రావు పేర్కొన్నారు.…
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు.…
మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్మికులకిస్తే అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతాయని మంత్రుల బృందం తెలిపింది. దీంతో మున్సిపల్ కార్మిక సంఘాలు కూడా సమ్మె విరమించేదే లేదని ఖరాకండిగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని సంఘాలతో చర్చలు జరిగాయన్నారు. చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామని…
కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో మున్సిపల్ కార్మకులు నిరసన బాట పట్టారు. విధులు బహిష్కరించి వేతన బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.