Antarvedi Beach: న్యూ ఇయర్ వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అంతర్వేది బీచ్ కి వెళ్ళిన ముగ్గురు యువకుల్లో ఓ యువకుడు జీప్ తో సహా గల్లంతయ్యాడు. కాకినాడ నుంచి వచ్చిన ముగ్గురు యువకులు అంతర్వేదిలో రూమ్ తీసుకున్నారు. న్యూ ఇయర్ వేళ రాత్రి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి 11:30 గంటలకు రూమ్ లో ఒక యువకుడు ఉండగా.. మిగతా ఇద్దరు థార్ జీప్ లో సముద్రం ఒడ్డుకు వెళ్ళారు.
Hyderabad: న్యూ ఇయర్ వేళ విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి.. అపస్మారక స్థితిలో మరో 15 మంది
అలా బీచ్ రోడ్లో జీప్ డ్రైవ్ చేస్తుండగా గట్టు దగ్గర మలుపును గమనించలేదు. దీంతో జీప్ గోదావరిలోకి దూసుకెళ్ళింది. అన్న చెల్లెలు గట్టు దగ్గర నదిలోకి జీప్ వెళ్తున్న విషయాన్ని గమనించిన వెంటనే జీప్ లో ఉన్న ఓ యువకుడు కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే జీప్ ను డ్రైవ్ చేస్తున్న నిమ్మకాయల శ్రీధర్ రూమ్ లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి గోదావరిలోకి జీప్ వెళ్ళిపోతోంది కాపాడాలంటూ కోరాడు.
Cyber Crime: రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి డిజిటల్ అరెస్ట్.. రూ.1.23 కోట్లు టోకరా.. ఎక్కడంటే..!
దానితో ఆ రూమ్లో ఉన్న యువకుడు మరికొందరని తీసుకొని అక్కడికి వచ్చే సమయంలోకే ఈ జీపు కనిపించకుండగా పోయింది. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అంతర్వేద పోలీసుల అధికారులు అంతర్వేది అన్న చెల్లెల కట్టు వద్ద చేరుకొని అక్కడ తర్వాత జీపుని బయటకి తీసే ప్రయత్నాలు చేస్తున్నరు. మృతదేహాన్ని కూడా అక్కడ ఆ జీపుని బయటికి తీసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం కూడా పంపించనున్నారు. ఆ కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియడంతోటి ఆ కుటుంబ సభ్యులు కూడా అన్న చెల్లెల గట్టు వద్దకు చేరుకున్నారు.