New Year Celebrations : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.680 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, డిసెంబర్ 31న రూ.282 కోట్ల విలువైన అమ్మకాలు, డిసెంబర్ 30న రూ.402 కోట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 వైన్స్ షాపులు, 1117 బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ…
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన సంవత్సరం వేడుక జోష్ లో యువత మునిగిపోయింది. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్కార్పియో బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
నూతన సంవత్సర వేడుకలకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల జోష్‌లో ఉన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు రెడీ అయ్యారు.
VC Sajjanar : టీజీఆర్‌టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా, సురక్షితంగా ప్రారంభించేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన ఆహ్వానం ప్రజల్లో చైతన్యాన్ని పెంచే విధంగా ఉంది. “కొత్త సంవత్సరం వేడుకలను మీ కుటుంబ సభ్యులతో మీ ఇళ్లలోనే జరుపుకోండి. ప్రమాదాల నుంచి దూరంగా, సంతోషకరంగా ఉండండి. గతంలో కొత్త సంవత్సరం వేడుకల పేరుతో…
మరో కొన్ని గంటల్లో 2024కు వీడ్కోలు పలికి.. 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. 2024 డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఎలా జరపుకోవాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటారు. అయితే దీన్ని ఆరోగ్యకరమైన రీతిలోనూ, ఆహ్లాదంగానూ జరుపుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని పెద్దలు చెబుతున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్‌ఆర్, ఫ్లైఓవర్‌లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు, క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు.
మన్మోహన్ సింగ్ మరణానంతరం పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని ఆరోపించింది. మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.
విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో.. 31వ తేదీ రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర వాసులకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పలు సూచనలు చేశారు.
Hyderabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.